తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ 93వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి నివాళులర్పించింది. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో ఆయన పాత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ తో పాటు సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర, శ్రీకాంత్ రావు, అర్చనా సేనాపతి, శ్రీకాంత్ గౌడ్, అనితా చౌదరి, నిట్టూరి రాజు తదితరులు పాల్గొన్నారు.








