-కల్వకుంట్ల కవిత
జాగృతి అధ్యక్షురాలిని కలిసిన మూవీ టీం (హైదరాబాద్)
రాజు వెడ్స్ రాంబాయి మూవీ టీమ్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో సినిమా నిర్మాత వేణు ఉడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, ప్రెజెంటర్ పూజారి నాగేశ్వర్ రావు, లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ పున్న, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు కల్వకుంట్ల కవితను కలిశారు. మూవీలోని టైటిల్ సాంగ్ ను మిట్టపల్లి సురేంందర్ చేత పాడించి విన్నారు కవిత. మంచి సక్సెస్ సాధించిన *రాజు వెడ్స్ రాంబాయి* సినిమా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా కవిత ఆకాంక్షించారు. ఇలాంటి మరిన్ని సందేశాత్మక చిత్రాలు రూపొందించాలని మూవీ యూనిట్ ను ప్రశంసించారు.











