శంకర్ గౌడ్ ది ప్రభుత్వ హత్యే
రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలి
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
(హైదరాబాద్)
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని తెలంగాణ జాగృతిఅధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కార్మికులు సమ్మెకు వెళ్తే.. సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను చూడలేక నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కొన ఊపిరితో కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్ ను పరామర్శించడానికి గురువారం అర్ధరాతి వెళ్తే ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా ఈ ప్రభుత్వం అడ్డుకున్నదన్నారు. ఆస్పత్రి నుంచి డాక్టర్ ను బయటికి పంపి శంకర్ గౌడ్ 80 శాతం కాలిన గాయాలతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని చెప్పించారని కవిత వివరించారు. తెల్లవారే సరికి శంకర్ గౌడ్ మరణించినట్టుగా ప్రకటించారని.. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యేనని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు రూ.2 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. డిప్యూటీ సీఎం శుక్రవారం ఆర్ టీసీ కార్మికులతో జరిపే చర్చల్లో వారి ప్రధాన డిమాండ్లు అయిన ఆర్ టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంస్థలో యూనియన్లను పునరుద్ధరించడం సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఆసుపత్రిలోకి వెళ్లకుండా కల్వకుంట్ల కవితను అడ్డుకున్న పోలీసులు
ఆత్మహత్యకు ప్రయత్నించిన శంకర్ గౌడ్ ను చూడడానికి గురువారం అర్థరాత్రి
కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి వెళ్లిన కవితను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆసుపత్రి కవిత ఆందోళన చేశారు. డాక్టరే బయటకు వచ్చి శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు.








