జాగృతిలో చేరిన ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
(హైదరాబాద్) :
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఆర్ వీ ఆర్ ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.








