సావిత్రీబాయి ఫూలే 195 వ జయంతి సందర్భంగా ఆమెకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. సావిత్రీబాయి స్ఫూర్తితో బాలికల చదువుకు తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.
బాలికా విద్య కోసం సంకల్పం
“సావిత్రి బాయి ఫూలే తన 17 ఏళ్ల వయసులోనే బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేశారు.
తన భర్త జ్యోతిరావ్ ఫూలే సహకారంతో ఆమె చదువుకోవటమే కాకుండా బాలికల చదువు కోసం పోరాటం చేశారు. ఎన్నో అవమానాలు ఎదురైనా అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్లారు. ఇవ్వాళ దేశంలో కోట్లమంది ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే ఆమె పోరాట, త్యాగ ఫలమే. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా దేశంలో ఆడబిడ్డల అక్షరాస్యత తక్కువ ఉన్నచోట మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జనంబాటలో భాగంగా గద్వాల్, నాగర్ కర్నూల్ లో ఆడబిడ్డల అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నట్లు గుర్తించాం. ఆ ప్రాంతంలో మహిళల అక్షరాస్యత పెంచేందుకు సంకల్పం తీసుకుంటున్నాను.”








