తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వనరుల వినియోగంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన 50 కమిటీల సభ్యులతో సోమవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ అధ్యయనం గురించి వివరించి ప్రాథమిక నివేదిక కమిటీ సభ్యులు సమర్పించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ రూపొందించే పనిలో నిమగ్నమైన తెలంగాణ జాగృతి.. ప్రజాభిప్రాయం మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని వివిధ కమిటీల సభ్యులు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధినేత్రి కల్వకుంట్ల కవిత మరో 20 రోజులు సమయం తీసుకొని సమగర అధ్యయంనం చేయాలని సూచించారు. తెలంగాణలో అన్నివర్గాల ప్రజల అవసరాలు, సమస్యలు గుర్తిస్తేనే వాటి పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. పూర్తి అధ్యయనం ద్వారా జాగృతి భవిష్యత్తుకు మార్గం ఏర్పాటు చేసుకోవడం సులువవుతుందని స్పష్టం చేశారు.









