తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు లోక రవిచంద్ర, వరలక్ష్మితో హెల్త్ కమిటీ సభ్యులు శ్రావణి, డాక్టర్ వికాస్, మ్యాకల తిరుపతి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రలో గత 12 సంవత్సరాల్లో వైద్య రంగంలో జరిగిన నెలకొన్న పరిస్థితులు, అవసరాలు, సమస్యలపై సమగ్ర పరిశీలన జరపాలని హెల్త్ కమిటీ సభ్యులకు స్టీరింగ్ కమిటీ సభ్యులు సూచించారు. కేస్ స్టడీస్ కూడా నివేదికలో పొందుపరచాలని చెప్పారు. రాజకీయ పార్టీగా అవతరించనున్న తెలంగాణ జాగృతి ప్రధాన లక్ష్యాల్లో వైద్య రంగం కీలకమని, ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కాగా ఇప్పటికే తాము సేకరించిన సమాచారాన్ని హెల్త్ కమిటీ సభ్యులు వివరించారు.









