తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల స్థితి గతుల అధ్యయన కమిటి సభ్యులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, వీరన్న, ఐదా ప్రశాంత్ లతో కూడిన త్రి సభ్య కమిటి జాగృతి స్ట్రీరింగ్ కమిటి సభ్యులతో భేటీ అయ్యింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదురుకుంటున్న సమస్యలు, వారి డిమాండ్స్, వివిధ పార్టీలు ఇచ్చిన హామీలు తదితర అంశాలపైన ఈరోజు స్ట్రీరింగ్ కమిటీ బాధ్యులు లకావత్ రూప్ సింగ్, లోక రవిచంద్ర, మంచాల వరలక్ష్మిని కలిసి చర్చించారు. వారి ప్రాథమిక నివేదికను స్టీరింగ్ కమిటీకి సమర్పించారు. తుది నివేదికను ఈ నెల 17న ఇవ్వనున్నట్టు జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.








