తెలంగాణ రక్షణ సేన నాయకులపై మంత్రి సీతక్క అనుచరుల దాడి

గోదావరిలో ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు ఏటూరునాగారం వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు

క్వారీల వరకు వెళ్లకుండా అడ్డుకొని దాడి చేసిన మంత్రి అనుచరులు

(తెలంగాణ రక్షణసేన, ములుగు జిల్లా)

గోదావరి నదిని చెరబట్టి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న మంత్రి సీతక్క అనుచరులు తెలంగాణ రక్షణ సేన నాయకులపై దాడికి తెగబడ్డారు. సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టు ముంపు పేరుతో ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెంలో గోదావరి నదిలో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు తెలంగాణ రక్షణ సేన నాయకులు బుధవారం మధ్యాహ్నం వెళ్లారు.

మంత్రి సీతక్క అనుచరులు టీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని దాడి చేశారు. వీడియోలు తీస్తున్న సెల్ ఫోన్లు లాక్కొని విసిరేశారు. గోదావరి నది నుంచి వెళ్లిపోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటామని హెచ్చరించారు.