ప్రొఫెసర్ నాగేశ్వర్ ను కలిసిన టీఆర్ఎస్ బృందం

ఆయనపై కేసులు ఎత్తివేయాలి

టీఆర్ఎస్ నేతల డిమాండ్

(హైదరాబాద్)

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ కు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదేశాలతో రాష్ట్ర నాయకుల బృందం గురువారం నాగేశ్వర్ ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా నాగేశ్వర్ పై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిజం గురువుగా, రాజకీయ విశ్లేషకుడిగా నాగేశ్వర్ తెలంగాణకు ఐకాన్ లాంటి వారని చెప్పారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లోని ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని గతంలోనే కవిత ప్రకటించారని గుర్తు చేశారు. నాగేశ్వర్ జోలికి వస్తే తెలంగాణలో ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. రాజకీయ విశ్లేషణలను సానుకూల దృక్పథంతో తీసుకోవాలని సూచించారు. తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని నాగేశ్వర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆర్వీఆర్ ప్రసాద్, డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, పుస్కూరి శ్రీకాంత్ రావు, మహేందర్ రెడ్డి, కనిష్క మహేందర్ రెడ్డి, మంచాల వరలక్ష్మి, డేవిడ్, ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.