ఈనెల 31న నిజామాబాద్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

 కలెక్టరేట్ గ్రౌండ్ లో  టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ

పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాకు తొలిసారిగా కవిత

సభ ఏర్పాట్లపై నిజామాబాద్  లో  జరిగిన సన్నాహక సమావేశం

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్)

ఈనెల 31న నిజామాబాద్ లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించెందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నది.  తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రానున్నారు.  నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే ఈ సభలో తెలంగాణ రక్షణ సేన పార్టీ తీసుకున్న 5 లక్ష్యాలను శ్రీమతి కవిత వివరిస్తారు. పార్టీ సిద్ధాంతాలను పల్లె పల్లెకు చేరువ చేయాలని కవిత ఈ సభ ద్వారా పిలుపునివ్వనున్నారు.

పాంచంజన్య సభ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నిజామాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని శ్రేణులకు రాష్ట్ర నాయకులు సూచించారు. 

పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు రానున్న కవితకు పెద్ద ఎత్తున సభ విజయవంతం చేసి ఘన స్వాగతం పలకాలని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి అలీం భాయ్ తెలిపారు. 

నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే సభతో ప్రధాన పార్టీలకు వెన్నులో వణుకు పుట్టాలని కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ రఘు పేర్కొన్నారు. నిజామాబాద్ లో జరిగే పంచజన్య సభకు డాక్టర్ రఘు ను ఇన్చార్జిగా ఇప్పటికే ప్రకటించారు అధ్యక్షులు కవిత. 

ప్రతి పల్లె నుండి భారీ ఎత్తున శ్రేణులు కదలాలని టిఆర్ఎస్ నాయకులు రంగు నవీన్ ఆచారి పిలుపునిచ్చారు. కవితక్క రాష్ట్రంలో అందరికి ఆడబిడ్డ అయితే నిజామాబాద్ జిల్లాకు కోడలు అని ఈ జిల్లా బిడ్డను ఆదరించి అక్కున చేర్చుకోవాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు.  శ్రేణులు ఆ దిశగా నడుంబిగించి అన్ని వర్గాల ప్రజలను కదిలించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈనెల 26న మిలాద్ ఉన్ నబి పండుగ ఉన్నందున సభను ఈనెల 31కు మార్చినట్లు ఆయన తెలిపారు.

ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి నవీన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సమస్యల మీద ఇప్పటికే పార్టీ నుండి ఉద్యమాలు నిర్వహించినందున ఆ వర్గాలను కూడా సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

ఈ సన్నాహక సమావేశం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి ఎం.ఎ అలీమ్,  కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి డా. రఘు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.