మహిళా సంక్షేమం కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై అధికారులతో
తెలంగాణ జగృతి రాష్ట్ర కార్యదర్శి, మహిళా కమిటీ సభ్యురాలు, ఖ్యాతిస్ ఫౌండేషన్ చైర్మన్ భవాని వేముల సమావేశమయ్యారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ జగృతి రాష్ట్ర కార్యదర్శి, మహిళా కమిటీ సభ్యురాలు భవాని వేముల జాయింట్ డైరెక్టర్ ధీరజ్, డైరెక్టర్ ఉదయ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ సునీతను కలిశారు. మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలు, వాటి చట్టపరమైన విధానాలు, అవగాహన కార్యక్రమాలు, సేవల వివరాలను ఈ సందర్భంగా తెలుసుకున్నారు.
అనంతరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), మున్సిపల్ ప్రాంతాల పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) కార్యాలయాలను సందర్శించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా అమలవుతున్న మహిళా సాధికారత ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలపై వివరాలను ప్రాజెక్ట్ డైరెక్టర్, అదనపు ఇన్చార్జి వసంత నుండి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన ‘కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం’ అనే లక్ష్యానికి అనుగుణంగా సెర్ప్, మెప్మా ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో భావాని వేములతో పాటు పద్మమ్మ పాల్గొన్నారు.









