జాగృతి అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్
నోరు పారేసుకోవద్దు : మనోజ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అసభ్యంగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన నువ్వా కవితక్క గురించి మాట్లాడేదంటూ మండి పడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధులు నలమాస శ్రీకాంత్ గౌడ్, మనోజా గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
రవీందర్ రావు కబ్జాకోరు -శ్రీకాంత్ గౌడ్

” నువ్వు ఏం ఉద్యోగం చేశావని వేల కోట్లు సంపాదించావో చెప్పాలి? శ్రీరామగిరిలో 65 ఎకరాలు, నెరేడా దగ్గర 30 ఎకరాల ఫామ్ హౌస్, కన్సికల్ లో 10 ఎకరాలు ఎక్కడివి? లక్ష్మారెడ్డి అనే ఆర్టీసీ ఉద్యోగికి చెందిన సర్వే నంబర్ 209 లోని 8 ఎకరాల భూమిని కబ్జా చేయలేదా? ఎమ్మార్వో రిపోర్ట్, కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా సరే ఆ భూమిని కబ్జా పెట్టిన కబ్జా కోరువు నీవు. ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ పెళ్లి కోసం కాళ్లా వేళ్లా పడినా సరే నువ్వు పట్టించుకోలేదు. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఇప్పటికి కూడా ఇంకా కోర్టు చుట్టు తిరుగుతున్నాడు. ఆ కుటుంబానికి ఏం సమాధానం చెబుతావ్ రవీందర్ రావు. 2014 లో శంకర్ నాయక్ కు టికెట్ ఇప్పిస్తానని తొర్రూర్ లో 10 ఎకరాల మామిడి తోట రాయించుకున్నావ్. ముందు మీ పార్టీ మనుకోటకు, రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి ఏంటో చెప్పండి? దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. 2018 లో పాలకుర్తి సీటు నీకు ఇవ్వకపోతే కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదా? సీటు ఇవ్వలేదని ఉద్యమకారులతో సభ పెట్టించి కేసీఆర్ గారిని తిట్టలేదా? ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ జనసమితి కోదండరాంతో చర్చలు జరపలేదా? బీజేపీతో దగ్గర కూడా మోకారిల్లి వాళ్లను డబ్బులు అడిగింది నిజమా? కాదా? మొన్నటి ఎన్నికల్లో కూడా గిరిజన బిడ్డలను ఓడించేందుకు నీ కురచ బుద్ధితో కుట్ర చేయలేదా? శంకర్ నాయక్, రెడ్యా నాయక్ ను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి నీ ఇంట్ల నుంచి పైసలు పంపలేదా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు కుట్ర చేసి బీఆర్ఎస్ కు ద్రోహం చేశావ్. నీ సొంత గ్రామం ఇచ్చంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిని పెట్టుకోలేని చావలేని చవటవు నువ్వు.
కాంగ్రెస్ తరఫున ఉన్న సందీప్ అనే వ్యక్తిని గెలిపించుకున్న నీచ చర్రిత నీది. రవీందర్ రావు నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ నాలుక కోస్తాం. తస్మాత్ జాగ్రత్త. 2018-2019 లో నల్గొండ ఇంఛార్జ్ గా నీకు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పార్టీ ఫండ్ ను నీ జేబులో వేసుకున్నావ్. నల్గొండ, మునుగోడు, హుజుర్ నగర్, నాగార్జున సాగర్.. ఇలా ఉప ఎన్నికలు వచ్చిన చోట బీఆర్ఎస్ ను సర్వనాశనం చేసిన చరిత్ర నీది. నీ విద్యాసంస్థల ద్వారా కూడా గిరిజన, బీసీ బిడ్డలకు అన్యాయం చేశావ్. విద్యార్థుల స్కాలర్ షిప్ లు మింగావ్. స్టాఫ్ కు జీతాలు ఎగ్గొట్టినవ్. కవితక్క అసలు నీ గురించే ఎప్పుడు మాట్లాడలేదు. నిన్ను పట్టించుకోలేదు. నిన్ను కుక్కలు కూడా పట్టించుకోవటం లేదు. అందుకే కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్. నీలాంటి థర్డ్ క్లాస్ ఫెలో గురించి కవితక్క మాట్లాడాలని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్. కానీ నీ గురించి కవితక్క అస్సలు పట్టించుకోరు. కేటీఆర్, కేసీఆర్ నా జేబులో ఉన్నారంటూ శంకర్ నాయక్ దగ్గర భూమి కొట్టేశావ్. 2023 లో బీఆర్ఎస్ ఓడిపోగానే మంత్రులు దొంగలు అని అన్నావ్.
కేసీఆర్ మా మాట వింటే ఓడిపోయే వాళ్లం కాదంటూ లోఫర్ మాటలు మాట్లాడావ్. అసలు నీ కుటుంబంతో నీకు సఖ్యత ఉందా? నీ అన్న చనిపోతే కనీసం ఐదు నిమిషాలు కూడా అంత్యక్రియల్లో లేని నీచుడవు నీవు. అన్న చనిపోయినా సరే పార్టీ కోసం పనిచేస్తున్నానని కేటీఆర్ దగ్గర పేరు కొట్టేసేందుకు శవాన్ని కూడా వాడుకున్న దుర్మార్గుడవు. బస్వరాజు రాజయ్యతో కలిసి ఆరుగురు ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశావ్.
కానీ నీ కబ్జా కోరు చరిత్ర తెలిసి కాంగ్రెస్ పార్టీ నిన్ను పార్టీలోకి రానివ్వలేదు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కొనసాగుతున్నావ్. జెర్రిపోతుల వెంకన్న అనే వ్యక్తి ని కూడా నువ్వు మోసం చేశావ్. కనీసం ఆయనను సర్పంచ్ గా గెలిపించలేకపోయావ్. అసలు క్యాడర్ లేని వెస్ట్ ఫెలో వి నువ్వు. కవిత గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటామా? బీఆర్ఎస్ కు శని లాగా పట్టి గోతులు తీస్తున్నావ్. నా లెటర్ హెడ్ మీదనే కవిత గారిని సస్పెండ్ చేశారని చెప్పటానికి సిగ్గు లేదా? జనంబాటలో భాగంగా ఫిబ్రవరి 2 రోజు మేము మానుకోటకు వస్తున్నాం. ఆ రోజు నీ బట్టలిప్పి బజార్లో నిలబెడతాం తస్మాత్ జాగ్రత్త.”
నీ బాధితులే నిన్ను తంతారు -మనోజా గౌడ్

“ఆడబిడ్డ గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు రవీందర్ రావు. కేసీఆర్ కు పిశాచి పుట్టిందని అంటావా? ఈ మాట కేసీఆర్ ముందు అంటే నిన్ను చెప్పు తీసి కొడుతారు. కవితక్క గురించి ఏమనుకుంటున్నావ్. నీలాంటి వెదవనా మాట్లాడేది? ట్విట్టర్ వేదికగా నీ భూ బాగోతాలను ఇలా చాలా మంది కవితక్కకు చెబుతున్నారు.
నీ బీఈడీ కాలేజీలలో పేద మహిళలకు అన్యాయం చేశావ్.
నువ్వు అన్యాయం చేసిన గిరిజన బిడ్డలు, మహిళలతోనే నిన్ను కొట్టిస్తాం. కవితక్కను బరితెగించిందని అంటావా? నీ నాలుక చీరేస్తాం. నీ అక్రమాలపై ఆధారాలతో వచ్చి నిన్ను జనంతో తన్నిస్తాం. విప్లవకారుడినని చెప్పుకునే నువ్వు మరో విప్లవకారుడు సురేష్ అన్నను చంపించ లేదా?బంధాలు, బంధుత్వాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అన్నదమ్ముల ఆస్తులు లాక్కొని వారి ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా? నిన్ను కుక్కలు కూడా పట్టించుకుంట లేవు. అందుకే ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నావ్. కేటీఆర్ దగ్గర, గుంటనక్క దగ్గర పేరు కొట్టేయాలని ఇష్టానుసారం మాట్లాడితే ఖబడ్దార్.”









