ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే కవితక్క లక్ష్యం
సూరారపు కృష్ణవేణి
ఆత్మకూరు ఎస్ : తెలంగాణలో ఉద్యమ కారుల ఆకాంక్షలు నెరవేర్చడం,అణగారిన వర్గాల ప్రయోజనాలు సమకూర్చడం సామాజిక న్యాయ తెలంగాణ సాధించడం లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు పనిచేస్తున్నారని టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి అన్నారు,ఆత్మకూరు ఎస్ మండలం నెమికల్ లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆవిర్భవించిన టీ ఆర్ ఎస్ పార్టీ ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు జెండా పండుగను జరుపుకోనుందని ప్రజల్లో చైతన్యం నిపుకుంటూ గ్రామ గ్రామాన జెండా పండుగను చేస్తున్నామని తెలిపారు,కవితక్క ఆదేశాల మేరకు ఊరూర పార్టీ నేతలు జెండా పండుగను విజయవంతం చేయాలని కోరారు, రాష్ట్రం లో రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడం లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కొనుగోలు కేంద్రాల్లో జరిగే అక్రమాలు అరికట్టాలని, రైతుకు మద్దతు ధర ఇవ్వడం తో పాటు మోసాలకు గురిచేయకుండా చూడాలని కోరారు ,ప్రభుత్వ వైఫల్యాలు ఎండ కడుతూ ప్రజలవైపున నిలబడి పోరాడుతామన్నారు ఈ కార్యక్రమం లో నాయకులు పాల్గొన్నారు








