క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నాంపల్లి చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తన చిన్ననాటి నుంచి మెథడిస్ట్ చర్చితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.












